ఏపీలోని విశాఖపట్నం వేదికగా జరిగిన వీల్‌చైర్ బాస్కెట్ బాల్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టు విజేతగా నిలిచింది. వీల్ చైర్ బాస్కెట్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఏపీ మెడ్ టెక్ జోన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 1, 2 తేదీలలో జరిగిన ఈ ఛాంపియన్‌షిప్ గెలిచేందుకు తెలంగాణ టీమ్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల జట్లతో పోటీ పడింది. మిగతా మూడు రాష్ట్రాలనూ చిత్తుచేసి తెలంగాణ వీల్‌చైర్ బాస్కెట్ బాల్ జట్టు విజేతగా నిలిచింది.