నేటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ఉభయసభలను ఉద్దేశించి అసెంబ్లీలో ప్రసంగిస్తారు. అనంతరం సభ వాయిదా పడనుంది. రేపటి నుంచి సభలో బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లులపై చర్చించనున్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్ సభకు హాజరుకానున్నారు. కాగా 19న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.