తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేతలు కాసేపట్లో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి ఢిల్లీ చేరుకున్నారు. కులగణన అంశంపై సూర్యాపేటలో ఈ నెల రెండో వారంలో భారీ బహిరంగ సభ, ఏప్రిల్ లో ఎస్సీ వర్గీకరణ అమలుపై గజ్వేల్ లో భారీ బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కేబినెట్ విస్తరణకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.