సీఎం రేవంత్ అధ్యక్షతన సచివాలయంలో ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సంక్రాంతి నుంచి రైతుభరోసా పథకం అమలుపై మంత్రివర్గం చర్చించి విధి విధానాలకు ఆమోదం తెలపనుంది. భూమి లేని నిరుపేదలకు కుటుంబానికి రూ.6 వేల చొప్పున ఏడాదికి రెండుసార్లు ఇవ్వాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది. ఈ కుటుంబాల గుర్తింపునకు ప్రాతిపదికగా తీసుకోవాల్సిన అంశాలూ చర్చకు రానున్నట్లు సమాచారం. కొత్త రేషన్‌కార్డులు, సన్నబియ్యం పంపిణీపై కూడా నిర్ణయం తీసుకోనుంది.