రేపు తెలంగాణ కేబినెట్ భేటీ

56చూసినవారు
రేపు తెలంగాణ కేబినెట్ భేటీ
తెలంగాణ సచివాలయంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ భేటీలో రైతు భరోసా పథకం, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చించనున్నారు. వ్యవసాయం, పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించిన అంశాలు ప్రధానంగా ఉంటాయని సమాచారం. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే కేబినెట్ మీటింగ్ విషయాన్ని ప్రకటించారు. సమావేశం తర్వాత కీలక అంశాలు వెలువడే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్