తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు జరగనుంది. ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అలాగే రైతు భరోసా చెల్లింపులు, సన్న వడ్లకు బోనస్, ఇందిరమ్మ ఇళ్ల పథకం సహా పలు కీలక అంశాలపై మంత్రులు చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.