అరవై ఏళ్ల పోరాటం తర్వాత సోనియా గాంధీ వలన తెలంగాణ వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు సోనియా గాంధీని ఎంతగానో గౌరవిస్తారని చెప్పారు. 'కాంగ్రెస్ కార్యకర్తగా సోనియా గాంధీ పేరుతో నేను ఓట్లు అభ్యర్థించా. జాతీయ నాయకులను రంగంలో ఉంచితేనే అంత పెద్ద మొత్తంలో ఓట్ల శాతం సాధించగలం. కాంగ్రెస్ క్యాడర్ లోకల్ లీడర్ పేరుతో ఓట్లు అడుగుతారు' అని వ్యాఖ్యానించారు.