తెలంగాణ సీఎం మార్పు.. మంత్రి శ్రీధర్ బాబు క్లారిటీ!

52చూసినవారు
తెలంగాణ సీఎం మార్పు.. మంత్రి శ్రీధర్ బాబు క్లారిటీ!
తెలంగాణ సీఎంని హైకమాండ్ మార్చే ఆలోచనలో ఉందంటూ గత కొన్ని రోజులుగా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇటీవల నిజామాబాద్ బీజేపీ MP ధర్మపురి అరవింద్ కూడా సీఎం మారబోతున్నారంటూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. ఈ అంశంపై మంత్రి శ్రీధర్ బాబు క్లారిటీ ఇచ్చారు. TG సీఎం మారతారంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. CM పదవికి రేవంత్ రెడ్డి పూర్తి అర్హుడని, సీఎంగా ఆయనే కొనసాగుతారని అన్నారు. రేవంత్ నాయకత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తోందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్