తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి క్యూ కడుతున్నారు. మొదట ఉత్తమ్.. ఆ వెంటనే భట్టిని ఢిల్లీకి రావాలని హైకమాండ్ నుంచి ఆదేశాలు రావడంతో వారిద్దరూ బయల్దేరారు. ఉత్తమ్‌తో పాటు ఆయన సతీమణి ఎమ్మెల్యే పద్మావతి కూడా వెళ్లారు. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు, ఉన్న మంత్రుల శాఖల మార్పు ఉంటుందనే సంకేతాలు వినిపిస్తున్నాయి. రెండు రోజులుగా ఢిల్లీలో హైకమాండ్ పెద్దలతో సీఎం రేవంత్ సమావేశాలు జరుపుతున్నారు.