తెలంగాణ ఈఏపీసెట్ వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ మళ్లీ ఆలస్యమవుతోంది. షెడ్యూల్ ప్రకారం ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా.. సాయంత్రం 4 గంటలకు మార్పు చేశారు. తాజాగా మరోసారి నమోదు ప్రక్రియను మార్పు చేసినట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు పేర్కొన్నాయి. వెబ్ ఆప్షన్లకు జులై 6 నుంచి 10 వరకు అవకాశం ఇచ్చారు.