ఆసియా కప్ భారత మహిళా సాఫ్ట్ బాల్ జట్టుకు తెలంగాణకు చెందిన చెపుర్వ ప్రవల్లిక ఎంపికైంది. వచ్చే నెల 14 నుంచి 20 వరకు చైనాలోని జియాన్‌లో జరిగే ఆసియా కప్‌లో పాల్గొననుంది. ఈ నేపథ్యంలోనే శనివారం మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి పొన్నంను ప్రవల్లిక మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ప్రవల్లికను మంత్రి పొన్నం అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆసియా కప్ సాఫ్ట్ బాల్ పోటీల్లో ప్రవల్లిక రాణించాలని ఆకాంక్షించారు.