సరస్వతీ పుష్కరాలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..

52చూసినవారు
సరస్వతీ పుష్కరాలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
తెలంగాణలోని కాళేశ్వరం క్షేత్రంలో ఈ ఏడాది మే 15 నుంచి 26 వరకు 12 రోజుల పాటు నిర్వహించనున్న సరస్వతీ నది పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని రేవంత్ సర్కార్ ఆదేశాలు జారీచేసింది. ఇందుకు రూ.25 కోట్లను మంజూరు చేసింది. ఈ పుష్కరాలకు లక్షలాదిగా భక్తులు వచ్చే నేపథ్యంలో మౌలిక సౌకర్యాల కల్పనతో పాటు.. స్నాన ఘట్టాల నిర్మాణం, రోడ్ల విస్తరణ, డ్రైనేజీల నిర్మాణం తదితర పనులను పకడ్బందీగా చేపట్టాలని ఆదేశాలు జారీచేసింది.

సంబంధిత పోస్ట్