తెలంగాణ అసెంబ్లీలో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగిస్తున్నారు. 'దేశంలోనే అత్యధికంగా వరి ఉత్పత్తి తెలంగాణలో జరుగుతోంది. ప్రభుత్వ హాస్టళ్లలో మెస్ చార్జిలు పెంచాం. సమగ్ర, సామాజిక కులగణన సర్వే నిర్వహించాం. దావోస్ పర్యటనలో భారీగా తెలంగాణ పెట్టుబడులను ఆకర్షించింది. రైతుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది' అని అన్నారు.