గోదావరి నదీ యాజమాన్య బోర్డు (GRMB)కు తెలంగాణ నీటిపారుదలశాఖ ఈఎన్‌సీ లేఖ రాసింది. గోదావరి-బనకచర్లపై ఏపీ ముందుకెళ్లకుండా చూడాలని లేఖలో కోరింది. ఈనెల 7న జరిగిన సమావేశంలోనూ ఈఎన్‌సీ ఇదే అంశాన్ని ప్రస్తావించింది. గోదావరి-బనకచర్ల ప్రతిపాదన ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని తెలుపుతూ లేఖలో పేర్కొంది.