ప్రపంచ స్థాయిలో తెలంగాణ పోటీపడతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కఅన్నారు. తెలంగాణ ఇప్పుడు దేశంతో కాదు.. అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడుతోందని చెప్పారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) హైదరాబాద్ శాఖ ఆధ్వర్యంలో HYDలో గురువారం జరిగిన CA విద్యార్థుల జాతీయ సదస్సులో ముఖ్య అతిథిగా హాజరై రాష్ట్ర అభివృద్ధి, యువత భవిష్యత్, మరియు చార్టెడ్ అకౌంటెంట్ వృత్తి విలువలపై ఆయన మాట్లాడారు.