TG: రాష్ట్రం పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయిందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం అప్పుల నుంచి కోలుకోవాలంటే కేంద్ర సాయం అవసరం అని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబి నుంచి బయట పడేలా చేయాడానికి బీఆర్ఎస్ పార్టీ సలహాలు సూచనలు ఇవ్వాలని ఈ సందర్భంగా కూనంనేని కోరారు. అలాగే కంచ గచ్చిబౌలి భూమి వ్యవహారంలో ఉన్న ఆ బీజేపీ ఎంపీ ఎవరో కేటీఆర్ బయట పెట్టాలని డిమాండ్ చేశారు.