దేశంలోనే ప్రతి జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్, ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. కరీంనగర్‌లోని చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజీలో జరిగిన MBBS-2019 విద్యార్థుల స్నాతకోత్సవంలో పాల్గొని మాట్లాడారు. BRS పదేళ్ల పాలన కాలంలో తెలంగాణలో మెడికల్ విద్య, ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు. పేషంట్లతో డాక్టర్లు సరిగా మాట్లాడితే సగం జబ్బు నయమవుతుందన్నారు.