తెలంగాణ మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ శనివారం మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరు మీద లేఖ విడుదల చేసింది. దామోదర్ లొంగిపోతున్నట్టు అసత్య ప్రచారం చేస్తున్నారని లేఖలో పేర్కొంది. సీతక్కపై వచ్చిన ప్రకటనతో తమకు సంబంధం లేదని వెల్లడించారు. ములుగు, భద్రాద్రి, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఆదివాసీలను పోలీసులు బెదిరింపులకు గురి చేస్తున్నారని అన్నారు.