తెలంగాణ పోలీస్‌ పనితీరుకు మొదటి ర్యాంక్‌.. సీఎం అభినందనలు

60చూసినవారు
తెలంగాణ పోలీస్‌ పనితీరుకు మొదటి ర్యాంక్‌.. సీఎం అభినందనలు
అత్యుత్తమ పనితీరుతో తెలంగాణ పోలీసు శాఖ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచినందుకు CM రేవంత్ రెడ్డి పోలీసు సిబ్బందికి అభినందనలు తెలిపారు. టాటా ట్రస్ట్, సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్, కామన్ కాజ్ వంటి ప్రఖ్యాత సంస్థలు రూపొందించిన ఈ నివేదికలో గుర్తింపు దక్కడం రాష్ట్ర పోలీసుల కృషికి దక్కిన గౌరవమని, ఈ ఘనత ప్రజలందరికీ గర్వకారణమని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలను తెలంగాణ పోలీసులు సాధించాలని CM ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్