తెలంగాణలో జనవరి 26వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వీటి కోసం కొన్ని రూల్స్ తప్పక పాటించాలి. పెళ్ళైన వారు కొత్త కార్డులకు అప్లై చేసుకోవాలంటే మ్యారేజ్ సర్టిఫికేట్‌తో పాటు ఆధార్ కార్డు కూడా ఉండాలి. రేషన్ కార్డుల్లో కొత్తగా ఎవరైనా పేర్లు చేర్చుకోవాలంటే వారి ఆధార్ కార్డు లేదా బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. ఇవన్నీ ఒరిజినల్స్ తీసుకుని మీ సేవా కేంద్రంలో అప్లై చేసుకోవాలి.