TG: ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం అసెంబ్లీలో తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నెల 14న రాష్ట్ర బంద్ నిర్వహిస్తున్నట్లు పలు సంఘాలు తెలిపాయి. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు వడ్లమూరి కృష్ణస్వరూప్, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు వీఎల్ రాజు విలేకరులతో మాట్లాడారు. PM మోడీ, CM రేవంత్, కిషన్ రెడ్డి, మంద కృష్ణ మాదిగ మాలలను అణచివేసేందుకు కుట్రలకు పాల్పడ్డారని దుయ్యబట్టారు.