తెలంగాణ టెట్ ప్రాథమిక కీ శనివారం విడుదలైంది. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ.. కీతో పాటు రెస్పాన్స్ షీట్లను విద్యాశాఖ అందుబాటులో ఉంచిందని, విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్ ద్వారా రెస్పాన్స్ షీట్లను పొందవచ్చని ఆయన తెలిపారు. అలాగే జులై 8 వరకు అభ్యర్థులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలిపే అవకాశం ఉందని పేర్కొన్నారు.