పాస్‌పోర్ట్ దరఖాస్తుదారుల పోలీసు ధృవీకరణ ప్రక్రియలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. తెలంగాణ పోలీసుల VeriFast యాప్ ద్వారా అత్యంత వేగంగా, మూడురోజుల వ్యవధిలో ఎక్కువ కేసులను పరిష్కరిస్తున్నట్టు విదేశాంగ శాఖ జాతీయ గణాంకాల్లో వెల్లడైంది. ఈ మేరకు ఢిల్లీలో జరిగిన పాస్ పోర్టు అధికారుల కాన్ఫరెన్స్‌లో తెలంగాణ ఇంటెలిజెన్స్ డీజీ శివధర్ రెడ్డి అవార్డును అందుకున్నారు.