ఖమ్మం(D) కల్లూరు(M) పేరువంచకు చెందిన రైతు దంపతులు సత్యనారాయణ, లక్ష్మీ కుమారుడు గురువేశ్వరరావు.. 4 ప్రభుత్వ కొలువులు సాధించాడు. మొదట నీటి పారుదలశాఖలో 2022లో విడుదలైన AE ఉద్యోగ నియామకాల్లో రాష్ట్రస్థాయి 253వ ర్యాంకుతో జాబ్ కొట్టాడు. తర్వాత గ్రూప్-4లో 1825 ర్యాంకుతో ఉద్యోగానికీ ఎంపికయ్యాడు. పాలిటెక్నిక్ లెక్చరర్ పరీక్షలో రాష్ట్రస్థాయిలో 215వ ర్యాంకు పొందాడు. తాజాగా AEE నియామక పరీక్షలో 257 ర్యాంకు సాధించి ఉద్యోగం సాధించాడు.