బనకచర్లతో తెలంగాణకు ఎలాంటి నష్టం లేదన్నారు ఏపీ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి. బనకచర్ల వల్ల రాష్ట్రం, రాయలసీమ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందన్నారు. రాజకీయ ఉనికి కాపాడుకోవడానికే తెలంగాణ ప్రభుత్వం బనకచర్లపై తప్పుడు వాదనలు చేస్తున్నారన్నారు. త్వరలోనే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. నంద్యాలలోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఐదో పంపు మోటార్‌కు మంత్రి పూజలు నిర్వహించి 6వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.