బెంగాల్ తీరంలో లభించే అరుదైన తెలియా భోలా చేపకు మార్కెట్‌లో భారీ డిమాండ్ ఉంది. దీని ధర కేజీ రూ.30,000–35,000 పలుకుతుంది. 2022లో 55 కిలోల చేప ఏకంగా రూ.13 లక్షలకు అమ్ముడుపోయింది. వీటిని ఘోల్ లేదా బ్లాక్ స్పాటెడ్ క్రోకర్ అని కూడా పిలుస్తారు. లోతైన సముద్రాల్లో జీవించే ఈ చేపలు సంవత్సరానికి 2 లేదా 3 మాత్రమే వలలో పడతాయి. ముఖ్యంగా ఫార్మా కంపెనీలు వీటి కోసం భారీ ధరలు వెచ్చించేందుకు సిద్ధంగా ఉంటాయి.