TG: ఫైళ్ల క్లియరెన్స్ కోసం మంత్రులు డబ్బులు తీసుకుంటున్నారన్న మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. 'ఎట్టకేలకు వాస్తవాలు మాట్లాడిన కొండా సురేఖకు అభినందనలు. కమీషన్లు తీసుకోకుండా సంతకం చేయట్లేదని కాంగ్రెస్ మంత్రే చెప్పారు. మంత్రి చేసిన ఆరోపణలపై రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ విచారణకు ఆదేశిస్తారా? మంత్రి సురేఖ ఆ మంత్రుల పేరు చెప్పాలి. కాంగ్రెస్ కమీషన్ సర్కార్ కావడం దురదృష్టకరం' అని Xలో పోస్ట్ చేశారు.