తెలుగు రాష్ట్రాల సీఎంలు త్వరలో సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విభజన సమస్యల్ని పరిష్కరించుకునేందుకు సీఎం చంద్రబాబు, సీఎం రేవంత్ రెడ్డి త్వరలో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు గత ఏడాది ప్రజాభవన్‌లో తొలిసారి సమావేశమై విభజన హామీలపై చర్చలు జరిపారు. కానీ, చాలా సమస్యలు అపరిష్కృతంగానే మిగిలిపోయాయి. దీంతో మరోసారి సమావేశం ఏర్పాటు చేసి చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.