ట్రాఫిక్ పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన టెంపో డ్రైవర్ (వీడియో)

84చూసినవారు
వాహన తనిఖీలు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు ఓ టెంపో డ్రైవర్ వార్నింగ్ ఇస్తూ బెదిరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ముంబైలో ఈ ఘటన జరిగింది. ట్రాఫిక్ పోలీసు తన మొబైల్ ఫోన్‌తో రోడ్డు పక్కన ఆగి ఉన్న టెంపోను ఫొటో తీశాడు. దీనికి డ్రైవర్ అభ్యంతరం చెప్పాడు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చివరికి ట్రాఫిక్ పోలీసు తన ఫోన్‌లో ఆ ఫొటోను తొలగించడంతో వివాదం సద్దుమణిగింది.

సంబంధిత పోస్ట్