తల్లి సెల్‌ఫోన్‌ ఇవ్వలేదని టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య

73చూసినవారు
తల్లి సెల్‌ఫోన్‌ ఇవ్వలేదని టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య
TG: తల్లి తనకు సెల్‌ఫోన్‌ ఇవ్వలేదని పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కుమురంభీం(D) కౌటాల మండల కేంద్రంలో శనివారం రాత్రి జరిగింది. బొమ్మకంటి సదానందం, రమాదేవి దంపతుల కుమార్తె స్ఫూర్తి (16) పదో తరగతి చదువుతోంది. టెన్త్ స్టడీ మెటీరియల్‌ను చూసుకోవడానికి సెల్‌ఫోన్‌ ఇవ్వాలని తల్లి రమాదేవిని కోరింది. ఫోన్‌ ఇస్తే గేమ్స్‌ ఆడతుందని, మెటీరియల్‌ను జిరాక్స్‌ తీసుకు వస్తానని సెంటర్‌కు వెళ్లింది. ఈ క్రమంలో మనస్తాపం చెందిన స్ఫూర్తి ఫ్యాన్‌కు ఉరేసుకుంది.

సంబంధిత పోస్ట్