పదో తరగతి పరీక్షల్లో కొడుకు బోర్డర్ మార్కులతో పాసయ్యాడు. తక్కువ మార్కులు వచ్చాయని దండించకుండా.. ఆ తల్లిదండ్రులు చేసిన పనికి అందరూ షాకయ్యారు. మహారాష్ట్రలోని సోలాపూర్‌కు చెందిన శివం వాఘ్మారే CBSE 10వ తరగతి బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడానికి అవసరమైన 35 శాతం మార్కులు సాధించాడు. దీంతో అతడి తల్లిదండ్రులు అతడికి పూలమాల వేసి, రంగులు చల్లి, ఊరేగింపుగా తీసుకెళ్లారు. స్వీట్లు తినిపించారు. ఈ వీడియో ట్విట్టర్‌లో వైరల్ అయ్యింది.