తెలంగాణలోని మెదక్ జిల్లా రామాయంపేటలో గురువారం అర్ధరాత్రి దారుణం జరిగింది. కాట్రియాల గ్రామానికి చెందిన ముత్తవ్వ అనే వృద్ధురాలు ఇంట్లో నిద్రిస్తుండగా.. కొందరు దుండగులు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటి పారిపోయారు. స్థానికులు గమనించి ముత్తవ్వను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ముత్తవ్వ ప్రాణాలు విడిచింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. మంత్రాల నెపంతోనే ముత్తవ్వకు నిప్పంటించినట్లు సమాచారం.