ఘోరం.. రీల్స్ పిచ్చితో ముగ్గురు యువకులు బలి

61చూసినవారు
ఘోరం.. రీల్స్ పిచ్చితో ముగ్గురు యువకులు బలి
యూపీలోని వారణాసిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోహనియా పోలీస్ స్టేషన్ పరిధిలోని చితాయ్‌పూర్‌లో బైక్‌పై రీల్స్ చేస్తు వెళుతున్న ముగ్గురు యువకులు బస్సును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఆ ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్