జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే. ఏడుగురు ఉగ్రవాదులు ఆర్మీ డ్రస్సులు వేసుకోవచ్చి ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మొదట ముగ్గురు మరణించినట్లు అధికారులు తెలుపగా తాజాగా 27 మంది టూరిస్టులు మృతి చెందినట్లు వెల్లడించారు. మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.