వరంగల్‌లో ఉగ్రవాది కలకలం

53చూసినవారు
వరంగల్‌లో ఉగ్రవాది కలకలం
తెలంగాణలోని వరంగల్‌ నగరంలో ఉగ్రవాదుల కదలికలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. వరంగల్ జానిపీరీలకు చెందిన జక్రియాకు పాకిస్తాన్ టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నాయని నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. అతడిని చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈనెల 25న శ్రీలంకకు వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాగా, కొంతకాలంగా నగరంలోని శివనగర్ అండర్ బ్రిడ్జ్ వద్ద జక్రియా బిర్యానీ సెంటర్ నడుపుతున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్