తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిన్న జరిగిన టెట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. 17 జిల్లాల్లో 92 పరీక్షా కేంద్రాల్లో తొలిరోజు పరీక్షకు ఉదయం 72.25 శాతం మంది, మధ్యాహ్నం 75.68 శాతం మంది హాజరయ్యారు. ఈ నెల 20 వరకు 10 రోజుల పాటు ఈ పరీక్షలు జరగనున్నాయి. పేపర్-1 పరీక్షను 8, 9, 10, 18 తేదీల్లో, 2, 5, 11, 12, 19, 20 తేదీల్లో పేపర్-2 పరీక్షని నిర్వహించనున్నారు.