టెట్ ఫలితాలపై MLC ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రభావం పడింది. ఈనెల 5న ఫలితాలు విడుదల చేస్తామని ఇటీవల పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. తాజాగా ఎన్నికలకోడ్ అమల్లోకి రావడంతో ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాల్సి ఉందని అధికారులు భావిస్తున్నారు. ఎన్నికల సంఘం పచ్చజెండా ఊపితేనే ఫలితాలు విడుదల చేస్తారు. MLC ఎన్నికల కోడ్ కారణంగా DSC ప్రకటన ఈ నెలలో ఉండకపోవచ్చని తెలుస్తోంది.