అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. ఈ ప్రకృతి విలయంలో మృతి చెందినవారి సంఖ్య 51కి చేరింది. ఒక్క కెర్ కౌంటీలోనే 15 మంది చిన్నారులు సహా 43 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. గ్వాడలూప్ నది ఉప్పొంగి.. మిస్టిక్ వేసవి శిక్షణా శిబిరాన్ని ముంచెత్తిన ఘటనలో గల్లంతైన 27 మంది బాలికల ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. కాగా మృతుల కుటుంబాలకు పోప్ లియో సంతాపం ప్రకటించారు.