తెలంగాణలో ఆదివారం జరిగిన గ్రూప్-3 పరీక్షకు తొమ్మిది నెలల గర్భిణి హాజరయ్యారు. జగిత్యాల జిల్లా కోరుట్లలోని అరుణోదయ డిగ్రీ కాలేజీలో గర్భిణి రీనా పరీక్షకు హాజరయ్యారు. ఈమె ప్రస్తుతం కథలాపూర్ మండలంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. భర్త కొమురోజు బాలకృష్ణ సహాయంతో గ్రూప్-3 పరీక్ష రాశారు. ఎగ్జామ్ సెంటర్ సిబ్బంది పూర్తి సహకారం అందించారని వెల్లడించారు.