మహబూబాబాద్(D) తొర్రూరు పట్టణ కేంద్రంలో గత రెండు మూడు రోజుల నుండి మామూలు జలుబు జ్వరంతో బాధపడుతున్న 9వ తరగతి విద్యార్థి సిద్ధార్థను తల్లి నాగరాణి, బాలాజీ నర్సింగ్ హోమ్ (సరస్వతి హాస్పిటల్)కు తీసుకొని వచ్చింది. డాక్టర్ పరిశీలించి పెద్దలకు ఇచ్చే ఎక్కువ డోస్ ఇంజక్షన్ ఇవ్వడంతో క్షణాలలో బాలుడు మృతి చెందాడు. బాలుడు శ్వాస ఆడక కళ్ళముందే మృతి చెందడం తట్టుకోలేక తల్లిదండ్రులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.