తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. HYDలోని హైటెక్స్ ప్రాంగణంలో FDC ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకలకు సుమారు 5 వేల మంది హాజరు కానున్నారు. ఈ సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానున్న గద్దర్ అవార్డుల ప్రదానోత్సవానికి సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సినీ తారల రాకతో హైటెక్స్ ప్రాంగణం సందడిగా మారనుంది. ఏర్పాట్లను FDC ఛైర్మన్ దిల్ రాజు పరిశీలించారు.