TG: ఘోర ప్రమాదం.. వాహనాల మధ్యలో ఇరుక్కున్న మృతదేహం

60చూసినవారు
TG: ఘోర ప్రమాదం..  వాహనాల మధ్యలో ఇరుక్కున్న మృతదేహం
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం చాగల్లులో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వాటర్ ట్యాంకర్ ను ఇసుక లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో జాతీయ రహదారిపై చెట్లకు నీళ్లు పోస్తున్న బండ హరీష్ (28) అక్కడికక్కడే మృతి చెందాడు. ట్యాంకర్ డ్రైవర్ బెజ్జం రమేష్ (35) కు స్వల్ప గాయాలు అయ్యాయి. లారీకి వాటర్ ట్యాంకర్ కి మధ్యలో మృతదేహం ఇరుక్కుంది. మృతుడు రాఘవపూర్ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.

సంబంధిత పోస్ట్