తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జగిత్యాల-ధర్మపురి జాతీయ రహదారిపై తక్కళ్లపల్లి వద్ద రెండు బైకులు ఢీ కొనడంతో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు జగిత్యాల మండలం జాబితాపూర్ వాసులు ఉన్నారు. ప్రమాదంలో మేడిపల్లి మండలం కొండాపూర్ వాసి ఒకరు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.