TG: సీఎం రేవంత్ ఆదేశాలతో.. కోడ్ ఉన్న జిల్లాలు మినహాయించి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ వంటి జిల్లాల్లో మొదటగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు. కాగా.. ప్రస్తుతం కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. వరంగల్- ఖమ్మం- నల్గొండ జిల్లాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరగబోతోంది.