తెలంగాణలో ఈనెల 7, 17న సెలవు దినాలుగా ప్రకటిస్తూ రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. వినాయక చవితి 7వ తేదీన, మిలాద్ ఉన్ నబీ 17న రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. హాలీడే క్యాలెండర్ ప్రకారం 16న మిలాద్ ఉన్ నబీకి ప్రభుత్వం సెలవు ఇచ్చింది. కానీ నెలవంక దర్శనం తేదీని బట్టి దాన్ని 17కు మార్చినట్లు తెలిపింది. అయితే ఇదేరోజు HYDలో గణేశ్ నిమజ్జనం జరగనుంది. దీంతో రెండు కార్యక్రమాల కోసం సెలవు ఇచ్చినట్లయింది.