TG: ప్రేమ పేరుతో వేధింపులు.. యువతి ఆత్మహత్య (వీడియో)

23241చూసినవారు
నల్లగొండ జిల్లా మాడుగులపల్లి(M) చింతలగూడెంలో కల్యాణి(19) అనే యువతిని అదే గ్రామానికి చెందిన అరూరి శివ, కొమ్మనబోయిన మధు అనే ఇద్దరు యువకులు ప్రేమ పేరుతో కొంతకాలంగా వేధిస్తున్నారు. ఎవరికి వారే తమను ప్రేమించకుంటే తన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెడతామని బెదిరించారు. దీంతో విరక్తి చెందిన కల్యాణి పురుగుమందు తాగి, విషయాన్ని తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది. స్థానికులు ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.

సంబంధిత పోస్ట్