TG: ఫార్మూలా ఈ-కార్ రేసింగ్ కేసులో తనపై ఏసీబీ నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ ఈ నెల 21న మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. గత విచారణలో భాగంగా ఈ నెల 30 వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయకూడదని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే నేడు కేటీఆర్‌పై ఏసీబీ పెట్టిన కేసులను కోర్టు కొట్టివేస్తుందా? లేక విచారణకు కొనసాగించాలని ఆదేశాలు జారీ చేస్తుందా? అనేది ఉత్కంఠగా మారింది.