TG: భారీ వర్షాలు.. 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

73చూసినవారు
TG: భారీ వర్షాలు.. 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
తెలంగాణలో మరో 5 రోజుల పాటు వర్షాలు పడే అవకాశముందని HYD వాతావరణ శాఖ తెలిపింది. గురువారం, శుక్రవారం మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఉరుములు మెరుపులతో అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది. నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట, నాగర్ కర్నూల్, వనపర్తి జోగులాంబ గద్వాల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

సంబంధిత పోస్ట్