తెలంగాణలో రాత్రి 8 గంటల నుండి 12 గంటల సమయంలో ఈదురు గాలులతో తీవ్రమైన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. అర్ధరాత్రి 12 గంటల నుండి 3 గంటల వరకు మధ్య తూర్పు తెలంగాణలో తీవ్రమైన వర్షాలు విస్తరిస్తాయని చెప్పారు. హైదరాబాద్‌లో అర్ధరాత్రి నుంచి ఉదయం వేళల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు.