తెలంగాణ ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభించింది. రూ.12,600 కోట్లతో ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. STSDF కింద రాబోయే ఐదేళ్ల పాటు RoR భూములను కలిగి ఉన్న ST రైతులకు భూమి అభివృద్ధి, ఉద్యానవన అభివృద్ధి & సోలార్ పంప్ సెట్ (ఆఫ్-గ్రిడ్) ఆధారిత నీటిపారుదల సౌకర్యాన్ని ఈ పథకం ద్వారా అందించనున్నారు. RoFR భూముల సమగ్ర అభివృద్ధి చేయడమే ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం.